నాగబాబు బర్త్‌డే; మెగా ఫ్యామిలీలో సందడి

Nagababu Konidela Birthday Celebrations In Mega Family - Sakshi

మెగా బ్రదర్‌, లాఫింగ్‌ స్టార్‌ నాగబాబు పుట్టినరోజు వేడుకలను ‘మెగా’ ఫ్యామిలీ ఘనంగా జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను వారు ట్విటర్‌లో పంచుకున్నారు. మంగళవారం( అక్టోబర్‌ 29) నాగబాబు పుట్టినరోజు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులతోపాటు అటు సినీ ప్రముఖులు ఇటు అభిమానుల నుంచి బర్త్‌డే విషెస్‌తో ట్విటర్‌ మోత మెగింది. నాగాబాబు గారాలపట్టి నిహారిక తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. తండ్రి నుదుటిపై ముద్దు పెడుతూ ‘ఐ లవ్‌ యూ నానా.. ఈ ప్రపంచంలో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది నువ్వే.. గత జన్మలో ఖచ్చితంగా నా కొడుకుగా పుట్టుంటారు.’ అంటూ నిహారిక తన తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. 

అలాగే కొడుకు వరుణ్‌ తేజ్‌ సైతం తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ‘నీ మొహం మీద చిరునవ్వు కోసం మేము ఏదైనా చేస్తాం. ఇంతటి అందమైన జీవితాన్ని అందించినందుకు ధన్యవాదాలు.. నాన్నా లవ్‌ యూ ద మోస్ట్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. మరోవైపు మెగా అల్లుడు సాయిధరమ్‌ తేజ్‌  ట్విటర్‌ వేదికగా మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘నాగాబాబు మామ హ్యాపీ బర్త్‌డే.. లవ్‌ యూ సో మచ్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగబాబు తనకుంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం బుల్లితెరలో ప్రసారమయ్యే ఓ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top