నాకొక కొత్త రోజులా ఉంది: నాగ చైతన్య | Naga Chaitanya Tweets About New Film with Samantha | Sakshi
Sakshi News home page

నాకొక కొత్త రోజులా ఉంది: నాగ చైతన్య

Mar 17 2018 9:43 AM | Updated on Aug 29 2018 5:43 PM

Naga Chaitanya Tweets About New Film with Samantha - Sakshi

‘ఏంమాయ చేసావె’  చిత్రం ద్వారా ప్రేక్షకుల్ని మెప్పించిన నాగ చైతన్య, సమంత మరోసారి అదే మ్యాజిక్‌ చేయబోతున్నారు. వివాహ బంధంతో ఒకటైన ఈ జంట వివాహానంతరం తొలిసారిగా  ఆన్‌ స్క్రీన్‌పై ఆలపించనున్నారు. ప్రస్తుతం చై-సామ్‌ కొత్త సినిమాలో నటించబోతున్నారు. ఇప్పటికే  ఈ విషయాన్ని నాగ చైతన్య తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ‘సమంతతో కలిసి పనిచేయడం నాకొక కొత్త రోజులా ఉంది... . గుడ్‌మార్నింగ్‌’  అంటూ ఇద్దరు కలిసి దిగిన ఫోటోను ట్వీట్‌ చేశాడు.

శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై  సాహు గరిపాటి, హరీశ్ పెద్ది నిర్మించనున్నారు. పెళ్లికి ముందు వీరి కాంబినేషన్ వచ్చిన ‘ఏమాయ చేశావె’, ‘మనం’  చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి. దీంతో  చై-సామ్‌ కలిసి నటించబోయే ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక  సమంత ‘రంగస్థలం’ షూటింగ్ పూర్తి చేసుకొని యూటర్న్‌ పనుల్లో బిజీ కాగా నాగ చైతన్య ‘సవ్యసాచి’ సినిమాను షూటింగ్‌లో పాల‍్గొంటున్నాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement