'మూడేళ్ల నుంచి వీకెండ్ ఖాళీ దొరకడం లేదు' | My Hollywood debut makes me nervous, says Deepika | Sakshi
Sakshi News home page

'మూడేళ్ల నుంచి వీకెండ్ ఖాళీ దొరకడం లేదు'

Jan 20 2016 11:00 PM | Updated on Apr 3 2019 6:23 PM

'మూడేళ్ల నుంచి వీకెండ్ ఖాళీ దొరకడం లేదు' - Sakshi

'మూడేళ్ల నుంచి వీకెండ్ ఖాళీ దొరకడం లేదు'

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా, హీరోలను సైతం తన నటనతో డామినేట్ చేస్తుందని అప్పుడప్పుడు ఆమె గురించి వార్తలు వినిపిస్తుంటాయి.

న్యూఢిల్లీ: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా, హీరోలను సైతం తన నటనతో డామినేట్ చేస్తుందని అప్పుడప్పుడు ఆమె గురించి వార్తలు వినిపిస్తుంటాయి. అయినప్పటికీ హాలీవుడ్ అరంగ్రేటం గురించి తనకు చాలా భయంగా ఉందట. ఈ వివరాలన్నీ దీపికా పదుకొనె గురించి అని ప్రేక్షకులు సులువుగా అర్థం చేసుకోవచ్చు.

ఇటీవలే హాలీవుడ్ సినిమాలలో, సీరియల్, ప్రొగ్రామ్స్ లలో నటిస్తున్న మాజీ ప్రపంచసుందరి ప్రియాంక చోప్రా బాటలోనే దీపికా నడుస్తోంది. బాలీవుడ్ మూవీస్ చూసే వారికి ఆమె నటన, ధైర్యంపై ఎటువంటి సందేహాలు లేవు. కానీ, హాలీవుడ్ అనే సరికి కాస్త భయం మొదలైందని దీపికా చెప్పింది. డీజే కరూసో దర్శకత్వం వహిస్తోన్న ఓ హాలీవుడ్ సినిమాలో విన్ డీసిల్, శామ్యూల్ ఎల్ జాక్సన్ లతో ఆమె స్క్రీన్ పంచుకోనున్నట్లు తెలిపింది. స్విట్జర్లాండ్ వాచ్ తయారీ సంస్థ టిస్సోట్ నూతన ఉత్పత్తులకు సంబంధించి న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి దీపికా హాజరైంది. ఈ సందర్భంగా మీడియా దీపికాను సంప్రదించగా కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, అవకాశం రావడాన్ని తాను చాలా గర్వంగా ఫీలవుతున్నానని పేర్కొంది. గత మూడేళ్ల నుంచి ఎంజాయ్ చేయడానికి ఒక్క వీకెండ్ కూడా ఖాళీ దొరకలేదని ఈ అమ్మడు తెగ బాధ పడిపోతోంది. అందుకే కాస్త తీరిక దొరికితే చాలు నిద్రపోవడానికి ఇష్టపడతానంటోంది. తనకు బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టమని, ప్రస్తుతం ఎలిజబెత్ టేలర్ ఆత్మకథ చదువుతున్నానని చెప్పింది. గతేడాది పీకూ, తమాషా, బాజీరావ్ మస్తానీ సినిమాలతో సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement