మా నాన్న నాకు పెళ్లి చెయ్యరు! | 'My father doesn't want me to get married' says Alia Bhatt | Sakshi
Sakshi News home page

మా నాన్న నాకు పెళ్లి చెయ్యరు!

Apr 12 2014 11:13 PM | Updated on Apr 3 2019 6:23 PM

మా నాన్న నాకు పెళ్లి చెయ్యరు! - Sakshi

మా నాన్న నాకు పెళ్లి చెయ్యరు!

ఈ రెండేళ్లల్లో బాలీవుడ్‌కి పరిచయమైన తారల్లో అలియా భట్ అందచందాలకు, అభినయానికి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. మరి.. మహేష్‌భట్ కూతురా...

ఈ రెండేళ్లల్లో బాలీవుడ్‌కి పరిచయమైన తారల్లో అలియా భట్ అందచందాలకు, అభినయానికి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. మరి.. మహేష్‌భట్ కూతురా... మజాకానా? అని బాలీవుడ్‌వారు అంటున్నారు. ‘‘నేను స్టార్ అనిపించు కోవడానికి రాలేదు. మంచి నటి అనిపించుకోవాలనే ఆకాంక్షతో సినిమాల్లోకి వచ్చాను’’ అని ఇటీవల ఓ సందర్భంలో అలియా అన్నారు. అందుకే, నటనకు అవకాశం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నారట. మహేష్‌భట్ మంచి దర్శకుడనే విషయం తెలిసిందే. తన తండ్రి దర్శకత్వంలో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఉందని అలియా పేర్కొన్నారు. 
 
 అంతా బాగానే ఉంది కానీ, ఈ సొట్ట బుగ్గల సుందరి పెళ్లికి తన తండ్రే అడ్డంకి అట. గమ్మత్తుగా ఉంది కదూ! విషయంలోకొస్తే... అలియాతో పాటు మహేష్‌భట్‌కి ఇంకో కూతురు కూడా ఉంది. తన పేరు షహీన్. తన ఇద్దరి కూతుళ్లనూ ప్రాణంతో సమానంగా భావిస్తారట మహేష్‌భట్. ఆ ప్రేమ పరాకాష్ట గురించి చెప్పాలంటే.. కూతుళ్లకి పెళ్లి చేస్తే, అత్తారింటికి వెళ్లిపోతారేమోనని బెంగ అట. దీని గురించి అలియా భట్ చెబుతూ -‘‘పెళ్లి చేసుకుని, 
 
 కూతురు అత్తారింటికి వెళుతుంటే ఏ తండ్రికైనా బాధగానే ఉంటుంది. మా నాన్నకి నేను, అక్క అంటే విపరీతమైన ప్రేమ. అందుకే మాకు పెళ్లి చేయకూడదను కుంటున్నారు. ‘పెళ్లి చేసుకుంటానంటే మీ ఇద్దర్నీ గదిలో బంధించేస్తా’ అని తమాషాగా అంటుంటారు’’ అని పేర్కొన్నారు. కూతుళ్లను ఇంతగా ప్రేమిస్తున్నారంటే.. మహేష్‌భట్ ఇల్లరికపు టల్లుళ్లను తెచ్చుకుంటారని ఊహించవచ్చు. మరి.. భవిష్యత్తులో మనసు మార్చుకుని కూతుళ్లని అత్తారింటికి పంపినా ఆశ్చర్యపోవడానికి లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement