కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ‘మా’ | Movie Artiste Association Greets KCR | Sakshi
Sakshi News home page

Dec 11 2018 7:00 PM | Updated on Dec 11 2018 7:54 PM

Movie Artiste Association Greets KCR - Sakshi

రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో విజయ పతాకాన్ని ఎగురవేసిన టి.ఆర్.ఎస్. అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావును మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అభినందించింది. అందరి అంచనాలను మించి అఖండ విజయాన్ని రెండోసారి కూడా సాధించిన ఘనత కె.సి.ఆర్.కు దక్కిందని 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. టి.ఆర్.ఎస్. ప్రభుత్వం చిత్రసీమ అభివృద్ధి కోసం ఎంతో కట్టుబడి ఉందని, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారిని, ఎఫ్.డి.సి. ఛైర్మన్ రామ్మోహనరావు గారిని ఎప్పుడు ఏ పని నిమిత్తం కలిసినా ఎంతో సహకరించారని ఆయన చెప్పారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ రజతోత్సవ సంవత్సరం సందర్భంగా తమ ముందు ఓ పెద్ద బాధ్యత ఉందని, గోల్డేజ్ హోమ్ నిర్మాణాన్ని ఈ కార్యవర్గం ఉండగానే ప్రారంభించాలను కుంటున్నామని శివాజీరాజా తెలిపారు. అందుకు కాబోయే ముఖ్యమంత్రి  కేసీఆర్ గారితో పాటు, కె.టి.ఆర్., హరీశ్ రావు, కవిత, తలసాని శ్రీనివాస యాదవ్ గార్ల సహకారం లభిస్తుందని భావిస్తున్నామని అన్నారు. తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'గోల్డ్ ఏజ్ హోమ్'ను కేసీఆర్‌ సహకారంతో ప్రారంభిస్తామన్నారు.

ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పిన ఫిగర్ ను రీచ్ కావడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, చెప్పి మరీ కేసీఆర్ మ్యాజిక్ ఫిగర్ ను దాటి భారీ మెజారిటీ సాధించారని 'మా' కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. సినీ ప్రముఖుల సహకారంతో, ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ లో గోల్డ్ ఏజ్ హోమ్ ను ప్రారంభించాలను కుంటున్నామని, తెలంగాణ ప్రభుత్వం సైతం తమ వంతు సహకారం అందిస్తుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement