మాస్‌ రాజా... డిస్కో రాజా!

Mass Maharaja Ravi Teja Turns Disco Raja - Sakshi

రవితేజ యాక్షన్‌లోనే కాదు ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్‌ పలికే తీరు కూడా ఫుల్‌ మాస్‌గా ఉంటాయి. మంచి మాస్‌ యాక్షన్‌ చిత్రాలతో ఆయన మాస్‌ మహరాజా అనిపించుకున్నారు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ చిత్రంలో నటిస్తున్న రవితేజ ఇప్పుడు మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సినిమాకు ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం’ చిత్రాల ఫేమ్‌ వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించనున్నారు.

రామ్‌ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తారట. ఈ చిత్రానికి ‘డిస్కో రాజా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఇందులో రవితేజ తండ్రీ కొడుకుల పాత్రల్లో నటించనున్నారని ప్రచారం జరగుతోంది. కాగా, ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ అక్టోబర్‌ 5న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ మూడు పాత్రలు చేయడంలేదని టాక్‌. ఇందులో ఇలియానా  కథానాయికగా నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top