రాహుల్‌ తో నాగ్‌ ప్రాంక్‌ వీడియో

Manmadhudu 2 Promotions Nagarjuna Akkineni Pranks Rahul Ravindran - Sakshi

కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మన్మథుడు 2. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నటుడు, నిర్మాత నాగార్జున దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌తో ఓ ప్రాంక్‌ వీడియో చేశారు. పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న రాహుల్‌ను ఓ రెస్టారెంట్‌కు పంపించి రకరకాల టాస్క్‌లతో ఇబ్బంది పెట్టాడు.

ఈ ఆదివారం నుంచి ప్రసారం కానున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షోకో హోస్ట్‌గా వ్యవహరించనున్న నాగ్‌, రాహుల్‌లో రియల్‌ లైఫ్‌లోనే అలాంటి టాస్క్‌లు చేయించాడు. నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్‌లు అతిథి పాత్రల్లో అలరించనున్నారు. వెన్నెల కిశోర్‌, లక్ష్మీ, రావూ రమేష్‌, ఝాన్సీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top