ప్రస్తుతం మహేష్‌ ఎక్కడ ఉన్నారంటే..? | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 28 2018 5:21 PM

Mahesh Babu Enjoying Holiday Trip In Foreign Countries - Sakshi

ప్రస్తుతం టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు గురించే చర్చ జరుగుతోంది. ట్యాక్స్‌ కట్టలేదని ఆయన ఖాతాలను సీజ్‌ చేశారనే న్యూస్‌ వైరల్‌ అవుతోంది. ఇక మహేష్‌ అభిమానులు ఈ విషయంపై కలవరపడుతుంటే.. ఆయన మాత్రం హ్యాపీగా హ్యాలిడే ట్రిప్‌లో ఎంజాయ్‌చేస్తున్నారు. 

క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలకు విదేశాలకు వెళ్లిన మహేష్‌ ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. ఇక్కడేమో పన్నులు కట్టలేదనీ​, ఆయన ఖాతాలను జీఎస్టీ అధికారులు సీజ్‌ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఏమాత్రం స్పందించకుండా మహేష్‌ సరదాగా హాలిడేను ఎంజాయ్‌ చేసేస్తున్నారు. జాలీగా హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్న పిక్‌ను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

చదవండి : 
మహేష్‌ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు స్వాధీనం

హీరో మహేష్‌కు ఝలక్‌: బ్యాంకు ఖాతాలు సీజ్‌ 

Advertisement
 
Advertisement
 
Advertisement