ఇరవైకోట్లు దొరికితే... | Maharjathakulu Movie Audio Release | Sakshi
Sakshi News home page

ఇరవైకోట్లు దొరికితే...

Sep 16 2017 12:55 AM | Updated on Aug 20 2018 2:14 PM

ఇరవైకోట్లు దొరికితే... - Sakshi

ఇరవైకోట్లు దొరికితే...

‘వెంకట్‌తో అలివేలు, నైస్‌గాయ్, ఎవరినైనా ఎదిరిస్తా’ చిత్రాల దర్శకుడు పరకోటి బాలాజి విలన్‌గా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మహర్జాతకులు’.

‘వెంకట్‌తో అలివేలు, నైస్‌గాయ్, ఎవరినైనా ఎదిరిస్తా’ చిత్రాల దర్శకుడు పరకోటి బాలాజి విలన్‌గా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మహర్జాతకులు’. అభిషేక్, మధుశ్రీ, డేవిడ్‌రాజ్, మోనా, స్మైలీ ప్రధాన పాత్రధారులు. ప్రదీప్‌రాజా, సాగరిక స్వరపరచిన ఈ సినిమా పాటల సీడీని తెలంగాణ ఫిలించాంబర్‌ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్‌ రిలీజ్‌ చేసి, తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శ్రీరంగం సతీష్‌కుమార్‌కి అందించారు.

పరకోటి బాలాజీ మాట్లాడుతూ– ‘‘క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో తీసిన చిత్రమిది. ముగ్గురు కుర్రాళ్లకు ఇరవైకోట్ల రూపాయలు దొరుకుతాయి. దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అనుకుంటున్న సమయంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నదే కథ. అక్టోబర్‌ నెలాఖరులో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. నిర్మాత మోహన్‌గౌడ్, చిత్ర సహనిర్మాత వి.కుమార్‌బాబు తదితరులు పాల్గొన్న ఈ సినిమాకి కెమెరా: తిరుమల ఎస్‌. రవికుమార్‌రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement