breaking news
Madhusri
-
ఇరవైకోట్లు దొరికితే...
‘వెంకట్‌తో అలివేలు, నైస్గాయ్, ఎవరినైనా ఎదిరిస్తా’ చిత్రాల దర్శకుడు పరకోటి బాలాజి విలన్‌గా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మహర్జాతకులు’. అభిషేక్, మధుశ్రీ, డేవిడ్‌రాజ్, మోనా, స్మైలీ ప్రధాన పాత్రధారులు. ప్రదీప్‌రాజా, సాగరిక స్వరపరచిన ఈ సినిమా పాటల సీడీని తెలంగాణ ఫిలించాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్ రిలీజ్ చేసి, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీరంగం సతీష్కుమార్కి అందించారు. పరకోటి బాలాజీ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ కామెడీ నేపథ్యంలో తీసిన చిత్రమిది. ముగ్గురు కుర్రాళ్లకు ఇరవైకోట్ల రూపాయలు దొరుకుతాయి. దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అనుకుంటున్న సమయంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నదే కథ. అక్టోబర్ నెలాఖరులో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. నిర్మాత మోహన్‌గౌడ్, చిత్ర సహనిర్మాత వి.కుమార్‌బాబు తదితరులు పాల్గొన్న ఈ సినిమాకి కెమెరా: తిరుమల ఎస్. రవికుమార్‌రెడ్డి. -
కేరాఫ్ తూర్పు గది
మున్నా, ప్రియాంక, మధుశ్రీ ముఖ్య తారలుగా శరగడం శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రోషిణి కేరాఫ్ తూర్పుగది’. శ్రీవారి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.శ్రీనివాస్, ఎస్.సుధీర్ నిర్మిస్తున్నారు. రాజ్ కిరణ్ సంగీత దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘హార్రర్‌తో కూడిన కామెడీ చిత్రమిది. భువనగిరి గౌరీ శంకర్ విలన్‌గా, రంజీత్‌కుమార్ పోలీసాఫీసర్‌గా తమ పాత్రలకు న్యాయం చేస్తున్నారు. పాలకొల్లు, నర్సాపురంలో తర్వాతి షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాం. రాజ్‌కిరణ్ మంచి పాటలు ఇచ్చారు’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: నండూరి వీరేషం.