సిని‘మా’ పోరు షురూ

MAA Elections on Tenth February - Sakshi

10న ‘మా’ అసోసియేషన్‌ ఎన్నికలు

నరేష్, శివాజీరాజా ప్యానెళ్ల ప్రచారం జోరు

బంజారాహిల్స్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు(2019–2021) ఈ నెల 10న జరగనున్న నేపథ్యంలో ఫిలింనగర్‌ వేడెక్కింది. ‘మా’ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న సీనియర్‌ నటుటు నరేశ్‌ ప్యానల్, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా ప్యానల్‌ రెండు వారాలుగా ప్రచార జోరు పెంచాయి. తాము గెలిస్తే ఏం చేయబోతున్నామో మేనిఫెస్టోలను కూడా విడుదల చేశాయి. ఎవరికి వారు ఇప్పటికే అగ్రనటీనటులను కలిసి వారి మద్దతు కోరారు. రెండేళ్లకోసారి జరిగే ‘మా’ ఎన్నికల్లో సుమారు 800 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఆదివారం ఉదయం 8 నుం చి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిలిం ఛాంబర్‌లో పోలింగ్‌ జరుగుతుంది.  

నరేష్‌ ప్యానల్‌..
అధ్యక్షుడిగా నరేష్, ఉపాధ్యక్షులుగా మాణిక్, హరినాథ్‌బాబు, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్, జనరల్‌ సెక్రెటరీగా జీవితా రాజశేఖర్, జాయింట్‌ సెక్రెటరీలుగా శివబాలాజీ, బి.గౌతంరాజు, ట్రెజరర్‌గా కోట శంకర్‌రావుతో పాటు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా పసునూరి శ్రీనివాసులు, అలీ, జేఎల్‌ శ్రీనివాస్, రాజర్షి, జాకీ, కరాటే కల్యాణి, స్వప్నమాధురి, ఎ.లక్ష్మీనారాయణ, శ్రీముఖి, నాగమల్లికార్జునరావు, బాబి, వింజమూరి మధు, సత్యం, అశోక్‌కుమార్, లక్ష్మీకాంతరావు, మోహన్‌ మిత్ర, జోగి బ్రదర్స్‌ కృష్ణంరాజు, కుమార్‌ పోటీపడుతున్నారు.

శివాజీరాజా ప్యానల్‌..
ఇందులో అధ్యక్షుడిగా శివాజీరాజా, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, వైస్‌ ప్రెసిడెంట్లుగా బెనర్జీ, ఎస్వీ కృష్ణారెడ్డి, జనరల్‌ సెక్రెటరీగా రఘుబాబు, జాయింట్‌ సెక్రెటరీలుగా బ్రహ్మాజీ, నాగినీడు, కోశాధికారిగా రాజీవ్‌ కనకాల, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా తనీష్, ఉత్తేజ్, అనితాచౌదరి, బాలాజీ, పృథ్విరాజ్, భూపాల్‌రాజు, సి.వెంకటగోవిందరావు, డి.రాజారవీంద్ర, డి.రవిప్రకాశ్, ఏడిద శ్రీరామ్, జయలక్ష్మి, వేణు మాధవ్, కొండేటి సురేష్, పి.సాయికుమార్, రాజ్‌తరుణ్, సమీర్, తనికెళ్ల భరణి తదితరులు పోటీపడుతున్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top