
దీపిక పదుకొణేతో రణ్‌వీర్ సింగ్ (ఫైల్ ఫొటో)
ముంబై : బాలీవుడ్‌లో మరో భారీ వివాహ వేడుక జరగబోతోందా?. ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. హాట్ పెయిర్ రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకొణేలు త్వరలో వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారనే ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నెల 5న(శుక్రవారం) రణ్‌వీర్, దీపికలకు శ్రీలంకలో నిశ్చితార్థం జరగనుందని దాని సారాంశం.
శుక్రవారం దీపిక పుట్టినరోజు కూడా. రణ్‌వీర్-దీపికలు గత ఐదేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు మాల్దీవులకు వెళ్లిన దీపిక, రణ్‌వీర్‌లు.. అక్కడి నుంచి ఇరువురి కుటుంబసభ్యులతో కలసి శ్రీలంకలకు వెళ్లనున్నట్లు తెలిసింది. నిశ్చితార్థం తర్వాత కొద్దిరోజుల్లోనే వివాహ వేడుక కూడా ఉంటుందని సమాచారం.