మీది చీప్ మెంటాలిటీ: హీరోయిన్ | leave your cheap mentality to judge women, says disha patani | Sakshi
Sakshi News home page

మీది చీప్ మెంటాలిటీ: హీరోయిన్

Feb 24 2017 7:05 PM | Updated on Jul 23 2018 8:49 PM

మీది చీప్ మెంటాలిటీ: హీరోయిన్ - Sakshi

మీది చీప్ మెంటాలిటీ: హీరోయిన్

టాలీవుడ్‌లో లోఫర్ సినిమాలో తళుక్కున మెరిసి, తర్వాత 'ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ' సినిమాలో నటించిన దిశా పటానీ తనను విమర్శించిన వాళ్ల మీద మండిపడింది.

టాలీవుడ్‌లో లోఫర్ సినిమాలో తళుక్కున మెరిసి, తర్వాత 'ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ' సినిమాలో నటించిన దిశా పటానీ తనను విమర్శించిన వాళ్ల మీద మండిపడింది. చీప్ మెంటాలిటీతో వ్యవహరించేవాళ్లకు సమాధానం చెప్పడం కూడా అనవసరమని తెగేసి చెప్పింది. దీనిగురించి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సందేశం పోస్ట్ చేసింది. తను దుస్తులు ధరించే తీరుమీద కొంతమంది ఫాలోవర్లు ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేసి, దుస్తులు అలా వేసుకోవాలి, ఇలా వేసుకోవాలని చెప్పడంతో వాళ్లందరికీ చెప్పుదెబ్బ లాంటి సమాధానం ఇచ్చింది. ఇటీవల జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌లో దిశాపటానీ నల్లటి దుస్తులు ధరించింది. పైనుంచి కిందవరకు ఉన్న ఆ గౌను మధ్యలో మాత్రం కాస్తంత ఖాళీగా కనిపిస్తుంది. దాని గురించి కామెంట్లు వెల్లువెత్తాయి. ఆమెను అసభ్యకరంగా కొంతమంది దూషించారు కూడా. ఈ వ్యవహారంపై ఆమె ఘాటుగా స్పందించింది. 
 
గత కొంతకాలంగా లైంగిక వేధింపులు, అత్యాచారాల గురించి చాలా కథనాలు చదువుతున్నానని, మన దేశంలో మహిళలను దేవతలుగా పూజిస్తారని చెప్పింది. మనిషికి - జంతువుకు మధ్య ఉండే తేడాలు తెలుసుకోవాలని, అవతలివాళ్లను ఎలా గౌరవించాలనే విషయాన్ని గుర్తించాలని అంది. మహిళలు తమ శరీరాన్ని ఎంతవరకు కప్పుకొని ఉంచుకుంటారన్న విషయం ఆధారంగా వాళ్లను అంచనా వేయడం సరికాదని, ఎక్కడెక్కడ వాళ్లు కప్పుకోవాలని చెబుతున్నారో అక్కడే కళ్లప్పగించి చూసే చీప్ మెంటాలిటీని ఒప్పుకోవడం అంత సులభం కాదని దిశాపటానీ వ్యాఖ్యానించింది. 'భారతీయ అమ్మాయి' అంటే ఇలాగే ఉండాలని ఎవరో చెప్పిన విషయానికి తాము కట్టుబడి ఉండబోమన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని, మీ ఫ్రస్ట్రేషన్ వల్ల ఒకళ్ల జీవితాలు పాడవ్వకుండా ఉండేలా చూసుకోవాలని తెలిపింది. మీ సొంత కుటుంబలోనే అలా జరిగితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంది. హిపోక్రసీని ఇప్పటికైనా ఆపి.. సొంతంగా ఆలోచించాలని గడ్డిపెట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement