తప్పు నీదే

Lavanya Tripathi: 'Not scared of failure - Sakshi

తప్పు నీదే... అని హీరోయిన్‌ లావణ్యా త్రిపాఠి సోషల్‌ మీడియాలో ఓ నెటిజన్‌పై మండిపడ్డారు. కూల్‌ బేబీ ఎందుకంత గరమ్‌ అయ్యారనడానికి ఓ కారణం ఉంది. లావణ్య ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటోను అందరూ ప్రశంసిస్తుంటే, ఒక నెటిజన్‌ మాత్రం విమర్శించాడు. ‘‘చూడటానికి చాలా అందంగా ఉన్నారు. కానీ, మీరు ట్రెడిషినల్‌ క్యారెక్టర్స్‌కు మాత్రమే సూట్‌ అవుతారు’’ అని ఆ వ్యక్తి అన్నాడు.

అయితే అతను ‘క్యారెక్టర్‌’ అనే వర్డ్‌ను తప్పుగా టైప్‌ చేశాడు. ‘‘నువ్వు టైప్‌ చేసిన క్యారెక్టర్‌ స్పెల్లింగ్‌లా నీ అభిప్రాయం కూడా తప్పే. నేను ఒక యాక్టర్‌ను. ఏ పాత్రనైనా చేయగలను. అనవసరంగా కేవలం ట్రెడిషనల్‌ క్యారెక్టర్స్‌ మాత్రమే చేయగలను అనే ముద్ర నా పై వేయడానికి ప్రయత్నించవద్దు’’ అని లావణ్య షూటుగా స్పందించారు. అమ్మడి ఆగ్రహం న్యాయమే కదా!

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top