‘అర్జున్‌ రెడ్డి’ని మించేలా!

Lakshmis Ntr Producer Rakesh Reddy Next Movie Announcement - Sakshi

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సంచలనం సృష్టించిన నిర్మాత రాకేష్ రెడ్డి మరో సినిమాకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తొలి ప్రకటన తిరుమల నుంచి చేశారు. రచయిత చిన్న కృష్ణ ఈ సినిమాకు కథ అందిస్తున్నట్టుగా తెలిపారు. అర్జున్‌ రెడ్డిని మించే కథను చిన్న కృష్ణ అందించినట్టుగా తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయన్న రాకేష్‌ రెడ్డి, వచ్చేనెలలో హీరో, దర్శకులను ప్రకటిస్తామన్నారు.

గురువారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రాకేష్ రెడ్డి, చిన్నికృష్ణలు ఈ ప్రకటన చేశారు. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమాతో రాకేష్‌ రెడ్డి ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు వసూళ్లు కూడా భారీగా రావటంతో తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top