ఉత్తీర్ణతే లక్ష్యం | Lakshmi Menon: I am planning to quit films soon! | Sakshi
Sakshi News home page

ఉత్తీర్ణతే లక్ష్యం

Feb 7 2015 3:31 AM | Updated on Apr 3 2019 9:12 PM

ఉత్తీర్ణతే లక్ష్యం - Sakshi

ఉత్తీర్ణతే లక్ష్యం

‘అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ప్రాముఖ్యత నిస్తాను. అంతకంటే ముందు ప్లస్-2లో మంచి మార్కులు సాధించాల్సిన్నదే నా ముందున్న లక్ష్యం’ అంటోంది నటి లక్ష్మీమీనన్.

‘అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ప్రాముఖ్యత నిస్తాను. అంతకంటే ముందు ప్లస్-2లో మంచి మార్కులు సాధించాల్సిన్నదే నా ముందున్న లక్ష్యం’ అంటోంది నటి లక్ష్మీమీనన్. పదో తరగతి చదువుతూనే నటిగా తెరంగేట్రం చేసిన ఈ కేరళ కుట్టి కుంకి చిత్రంలో కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసింది. తొలి చిత్రమే ఘన విజయం సాధించడం, తన నటనకు ప్రశంసల జల్లు కురవడంతో అమ్మడికి వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి. అదృష్టం కూడా కలసివచ్చి లక్కీ హీరోయిన్ అయ్యింది.

పాండియనాడు, నాన్‌శివప్పు మనిదన్, మంజాపై అంటూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ మలయాళి భామ తాజాగా నటించిన కొంబన్ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో లక్ష్మీమీనన్ కార్తీతో రొమాన్స్ చేసింది. కాగా ఈ అమ్మడుపై వదంతులు జోరుగానే సాగుతున్నాయి. ఆ మధ్య విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి కలకలానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ తరువాత ఆయనతో చెట్టాపట్టాలంటూ కూడా ప్రచారం హల్‌చల్ జోరందుకుంది.

తాజాగా ఈ భామ నటనకు గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టే విధంగా లక్ష్మీమీనన్ మాట్లాడారు. తనకు భవిష్యత్ ప్రణాళికలు చాలా ఉన్నాయని చెప్పారు. గ్లామరస్ పాత్రలను కోరుకుంటున్నానని, అందుకే కొన్ని చిత్రాల అవకాశాలను నిరాకరించినట్లు చెప్పింది. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం తన ముందున్న ఏకైక లక్ష్యం ప్లస్-2 పరీక్షలులో మంచి మార్కులతో పాస్ అవ్వాలన్నదేనని అంది. త్వరలో జరగనున్న పరీక్షలకు సిద్ధమవుతుండడంతో నటనకు చిన్న గ్యాప్ ఇచ్చినట్లు తెలిపింది.

ఆంగ్ల లిటరేచర్‌ను కావాలన్నది తన కోరిక అని పేర్కొంది. అంతేకాదు ప్యాషన్ డిజైనర్ నవ్వాలనే ఆశ కూడా ఉందని చెప్పింది. ఇవి సినిమా పరిశ్రమలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పింది. ఇవన్నీ కావాలంటే చెన్నై కళాశాలలో చేరాలనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు అలాంటి ఆలోచనలేదన్నారు. తాజా చిత్రం కొంబన్ గురించిన విశేషాలేమిటన్న ప్రశ్నకు మరోసారి గ్రామీణ నేపథ్యంలో నటించిన చిత్రం కొంబన్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement