ఆ ఇద్దరి కాంబినేషన్‌లో భారీ చిత్రం | KV Anand to team with Vijay Sethupathi | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో భారీ చిత్రం

Mar 16 2016 2:06 AM | Updated on Sep 3 2017 7:49 PM

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో భారీ చిత్రం

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో భారీ చిత్రం

కేవీ.ఆనంద్, విజయ్‌సేతుపతి కాంబినేషన్‌లో ఒక భా రీ చిత్రం తెరకెక్కనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది.

 కేవీ.ఆనంద్, విజయ్‌సేతుపతి కాంబినేషన్‌లో ఒక భా రీ చిత్రం తెరకెక్కనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. ఇంతకు ముందు కో, ఆ మధ్య అయన్, ఆ తరువాత అనేగన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కేవీ.ఆనంద్. ఈయన తాజా చిత్రానికి సిద్ధమయ్యారు.అయితే ఇందులో నటించే కథానాయకుల గు రించి పెద్ద లిస్టే ప్రచారంలో ఉంది. ఆర్య, జీవా,శివకార్తికేయన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరి గింది.
 
  ఒక దశలో జీవా ఫిక్స్ అయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా మరో యువ న టుడు విజయ్‌సేతుపతి పేరు వినిపిస్తోంది. కేవీ.ఆనంద్ విజయ్‌సేతుపతి కాంబినేషన్‌లో చిత్రం దాదాపు ఖరారైనట్లేనని తా జా సమాచారం. ఈ చిత్రాన్ని ఒక ప్రము ఖ చిత్ర నిర్మాణ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement