‘ఈ నగరానికి..’ చీఫ్‌ గెస్ట్‌గా కేటీఆర్‌!

KTR Is Chief Guest To Ee Nagaraniki Emaindi Movie Pre Release Event - Sakshi

మొదటి సినిమాతోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన డైరెక్టర్‌ తరుణ్‌భాస్కర్‌. పెళ్లి చూపులు సినిమా తరుణ్‌ భాస్కర్‌ను స్టార్‌ డైరెక్టర్‌గా నిలబెట్టింది. తన రెండో సినిమాను చాలా గ్యాప్‌ తీసుకుని సురేష్‌ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే టైటిల్‌తో వస్తోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నేడు(జూన్‌ 25) నిర్వహించబోతున్నారు. 

ఈ వేడుకకు రాష్ట్ర ఐటీ మంత్రి కే తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సినిమా పరిశ్రమతో అత్యంత సన్నిహితంగా ఉండే కేటీఆర్‌ ఇటీవలే రంగస్థలం, భరత్‌ అనే నేను ప్రమోషన్‌​ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా ఈ నగరానికి ఏమైంది? మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరుకాబోతున్నారు. కేటీఆర్‌తో పాటు రానా, నాగ చైతన్య, విజయ్‌దేవరకొండ ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. 

టీజర్‌, సాంగ్స్‌, పోస్టర్స్‌తో ఆకట్టుకుంటోన్న ఈ సినిమాను.. నలుగురు స్నేహితుల పాత్రల చుట్టూ తిరిగే కథగా తెరకెక్కించారు తరుణ్‌ భాస్కర్‌. ఈ సినిమా కూడా పెళ్లి చూపులు సినిమాలా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. వివేక్‌ సాగర్‌ సంగీతమందించిన ఈ సినిమా జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top