స్పోర్ట్స్‌ కామెడీ

Konka Productions acquired Godha Telugu rights - Sakshi

గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై పెద్ద హిట్‌ సాధించిన మలయాళ చిత్రం ‘గోదా’. టవీనొ థామస్‌ , వామికా గబ్బి, ప్రముఖ రచయిత రెంజీ పనికర్‌ నటించిన ఈ చిత్రానికి బసిల్‌ జోసఫ్‌ దర్శకత్వం వహించారు. 2017 మేలో విడుదలైన ఈ సినిమా మాలీవుడ్‌లో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. బాలీవుడ్‌లో సైతం ఈ సినిమాను రీమేక్‌ చేసేందుకు భారీ నిర్మాణ సంస్థలు సిద్ధమవుతున్నాయి. తెలుగులో కొంకా ప్రొడక్షన్స్‌ సంస్థ ‘గోదా’ డబ్బింగ్‌ మరియు రీమేక్‌ రైట్స్‌ సొంతం చేసుకొంది.

తెలుగు హక్కుల కోసం ఎంతోమంది పోటీ పడగా నిర్మాత సంతోష్‌ కొంకా ఫ్యాన్సీ ఆఫర్‌తో సొంతం చేసుకున్నట్లు  కొంకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ రాజీవ్‌ కె.రామ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ –‘‘ఇది స్పోర్ట్స్‌ కామెడీ మూవీ. ప్రస్తుతం తెలుగు రీమేక్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. మలయాళంలోలా తెలుగులోనూ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Back to Top