పార్తిబన్ తాజా చిత్రం కొడిట్ట ఇడంగలై నిరప్పుగ | Koditta Idangalai Nirappuga R Parthiepan | Sakshi
Sakshi News home page

పార్తిబన్ తాజా చిత్రం కొడిట్ట ఇడంగలై నిరప్పుగ

Jul 15 2016 1:47 AM | Updated on Sep 4 2017 4:51 AM

పార్తిబన్ తాజా చిత్రం కొడిట్ట ఇడంగలై నిరప్పుగ

పార్తిబన్ తాజా చిత్రం కొడిట్ట ఇడంగలై నిరప్పుగ

నటుడు, దర్శకుడు ఆర్.పార్తిబన్ మరోసారి బిజీ అవుతున్నారు.ఈయన దర్శకత్వం వహించి చాలా కాలమైంది.

నటుడు, దర్శకుడు ఆర్.పార్తిబన్ మరోసారి బిజీ అవుతున్నారు.ఈయన దర్శకత్వం వహించి చాలా కాలమైంది. కథై తిరైకథై విచనం ఇయక్కమ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించినా ఆ తరువాత మరో చిత్రం చేయలేదు.అయితే నటుడుగా పార్తిబన్ అడపాదడపా నటిస్తూనే ఉన్నారు. చాలా గ్యాప్ తరువాత మోగాఫోన్ పట్టనున్నారు. అదే విధంగా నటుడిగానూ బిజీ అవుతున్నారు. దీని గురించి ఆయన తెలుపుతూ తాను దర్శకత్వం వహించనున్న తాజా చిత్రాన్ని క్రౌడ్ ఫిలింస్ పతాకంపై రూపొందించనున్నట్లు వెల్లడించారు.
 
  దీనికి కొడిట్ట ఇడంగలై నిరప్పుగ అనే పేరును నిర్ణయించినట్లు తెలిపారు. విజయకుమార అనే ఫేస్‌బుక్ ఫ్రెండ్ తాను 10 లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టగలను తనను నిర్మాతగా నిలబెట్టండి అని అన్నారన్నారు. అది చూసి మరికొందరు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారని చిన్న నిర్మాతలే రేపటి పెద్ద నిర్మాతలన్నట్టు వీరిని తయారు చేయాలన్న పట్టుదలతో చేస్తున్న చిత్రం కొడిట్ట ఇడంగలై నిరప్పుగ చిత్రం అన్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంగీతాన్ని సత్య, పాటలను మదన్ కార్గీ అందిస్తున్నారని చెప్పారు.
 
 నటుడిగా సుశీంద్రన్ దర్శకత్వంలో విష్ణువిశాల్, శ్రీదివ్య జంటగా నటిస్తున్న చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నానని తెలిపారు. దీనితో పాటు కయల్ చంద్రన్ హీరోగా నటిస్తున్న చిత్రంలోనూ,అక్టోబర్‌లో ప్రారంభం కానున్న శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించన్న చిత్రంలోనూ నటించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు మరికొన్ని చిత్రాల నటించాల్సి ఉందని పార్తిబన్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement