20 ఏళ్ల తరువాత అవతార్ సీక్వల్ లో.! | Kate Winslet and James Cameron to reunite in Avatar sequel | Sakshi
Sakshi News home page

20 ఏళ్ల తరువాత అవతార్ సీక్వల్ లో.!

Oct 5 2017 12:52 PM | Updated on Oct 5 2017 2:32 PM

James Cameron Kate Winslet

టైటానిక్.. విడుదలైన ప్రతీచోటా సంచలన విజయం సాధించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్. హాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హీరో హీరోయిన్లు గా నటించిన లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్ లెట్ లా జీవితాలను మార్చేసింది. అయితే సినిమా రిలీజ్ అయిన ఇరవైయ్యేళ్ల తరువాత మరోసారి ఇదే కాంబినేషన్ రిపీట్ అవ్వబోతోంది.

అవతార్ సినిమాతో మరో భారీ విజయాన్ని సాధించిన కామరూన్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కేట్ విన్స్ లెట్ మరోసారి కామరూన్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమాను 2020 డిసెంబర్ 18న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే అవతార్ 2తో పాటు 3, 4, 5లను కూడా రూపొందిస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. రెండో భాగంలో నటించనున్న కేట్ విన్స్ లెట్ తరువాత సీక్వల్స్ లో నటిస్తుందీ లేనిదీ ఇప్పుడే చెప్పలేమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement