దర్శకులకు ఆఫర్‌.. తండ్రి పాత్రలకైనా సిద్దం | Karan Johar Announces Iam Available For Father Roles | Sakshi
Sakshi News home page

తండ్రి పాత్రలో నటించడానికి రెడీ: కరణ్‌

May 6 2020 10:42 AM | Updated on May 6 2020 1:14 PM

Karan Johar Announces Iam Available For Father Roles - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌లో దర్శకనిర్మాత కరణ్‌ జోహర్ ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌‌ కారణంగా సినీ ప్రముఖులు ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా కరణ్ జోహర్‌‌ ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఇందులో కరణ్‌ కళ్లజోడు పెట్టుకొని తెల్లగా నెరసిపోయిన జుట్టుతో పౌట్‌ పోజు పెట్టి సెల్ఫీ దిగారు. ‘ప్రస్తుతం ఉన్న వైరస్‌ కంటే నా నటన చాలా భయంకరంగా ఉంటుందని తెలుసు. కానీ, రెండో అవకాశం కోసం చూడటం ఏమాత్రం హానికరం కాదు. అందుకే దర్శకనిర్మాతలకు ఒక ప్రకటన చేస్తున్నాను. ప్రేక్షకులను అలరించడానికి నేను తండ్రి పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని ఆయన కామెంట్‌ జత చేశారు. (రణ్‌బీర్‌.. కత్రినా ఎన్‌సైక్లోపిడియా)

ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. కరణ్‌ పోస్ట్‌ చేసిన ఫొటోపై సినీ ప్రముఖులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మీ మెయింటెనెన్స్ హీరోయిన్‌ కంటే ఎక్కువగా ఉంటుంది’ అని దర్శకనిర్మాత ఫరాఖాన్‌ సరదాగా కామెంట్‌ చేశారు. ‘చక్కటి పౌట్‌ పోజ్‌తో ఓ  ఫాదర్‌’ అంటూ  హీరోయన్‌ కృతి సనన్‌ కామెంట్‌ చేశారు. అదేవిధంగా మీ లుక్‌ బాగుందని నటి శిల్పాశెట్టి ట్వీట్‌ చేశారు. కరణ్‌ చివరగా ‘బాంబే వెల్వెట్’‌ చిత్రంలో కనిపించారు. అదేవిధంగా షారూఖ్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘దిల్‌వాలే దుల్హానియా లే జయేంగే’  సినిమాలో కరణ్‌ నటించిన విషయం తెలిసిందే. (కరణ్‌ న్యూలుక్‌.. హీరో కామెంట్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement