హృతిక్‌ వెనక్కి తగ్గాడా..!

Kangana Ranaut and Hrithik Roshan Will Not Be Clashing - Sakshi

బాలీవుడ్ స్టార్స్‌ హృతిక్‌ రోషన్‌, కంగనా రనౌత్‌ల మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. అయితే కొత్త ఏడాదిలో ఈ ఇద్దరు వెండితెర మీద తలపడేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపించాయి. హృతిక్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూపర్‌ 30, కంగనా లీడ్‌ రోల్‌లో నటించిన మణికర్ణిక సినిమాలు రిపబ్లిక్‌ డే సందర్భంగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి.

అయితే సూపర్‌ 30 చిత్ర దర్శకుడు వికాస్‌పై మీటూ ఆరోపణల కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమైంది. దీంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్‌ కావటం కష్టమన్న టాక్‌ వినిపిస్తోంది. మణికర్ణిక నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకోవటంతో అనుకున్నట్టుగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రావటం కన్ఫామ్‌ అయ్యింది. దీంతో భారీ చర్చకు దారి తీసిన హృతిక్‌, కంగనా పోటి తెర మీద చూసే అవకాశాన్ని ప్రేక్షకుల మిస్‌ అయినట్టే అంటున్నారు విశ్లేషకులు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top