మరో సారి ఐటెంసాంగ్‌లో మెరవనుందా? | kajal Aggarwal May Do Special Song In Trivikram Allu Arjun Movie | Sakshi
Sakshi News home page

మరో సారి ఐటెంసాంగ్‌లో మెరవనుందా?

Jun 9 2019 7:48 PM | Updated on Jun 9 2019 8:57 PM

kajal Aggarwal May Do Special Song In Trivikram Allu Arjun Movie - Sakshi

సినిమాలో హీరోయిన్‌గా వచ్చే క్రేజ్‌ కంటే.. ఒక్క ఐటెంసాంగ్‌తో వచ్చే స్టార్‌డమ్‌ ఎక్కవ. అందుకే మన టాలీవుడ్‌లో ప్రత్యేక గీతాలది ప్రత్యేక స్థానం. మాస్‌ను ఆకట్టుకునే ఈ పాటలతో నటించే హీరోయిన్లకు డిమాండ్‌ ఎక్కువగానే ఉంటుంది.

స్టార్‌ హీరోయిన్లు ఐటెంసాంగ్‌ చేస్తున్నారంటే మరింత స్పెషల్‌గా డిజైన్‌ చేస్తారు మేకర్స్‌. తమన్నా​, కాజల్‌ అగర్వాల్‌ ప్రత్యేక గీతాలతో మాస్‌ను ఆకట్టుకున్నారు. జనతా గ్యారెజ్‌లో పక్కా లోకల్‌ అంటూ ఓ ఊపు ఊపిన కాజల్‌.. మరో సారి ఓ స్పెషల్‌ సాంగ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రంలో కాజల్‌ స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె రెండో షెడ్యూల్‌ను ప్రారంభించగా.. నివేథా పేతురాజ్‌ జాయిన్‌ అయినట్లు యూనిట్‌ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement