ఖుషీ కాంబినేషన్లో మరో మూవీ | jyothika to Pair with Vijay in His next | Sakshi
Sakshi News home page

ఖుషీ కాంబినేషన్లో మరో మూవీ

Dec 28 2016 1:19 PM | Updated on Oct 30 2018 5:58 PM

ఖుషీ కాంబినేషన్లో మరో మూవీ - Sakshi

ఖుషీ కాంబినేషన్లో మరో మూవీ

పెళ్లి తరువాత సినిమాకు దూరమైన జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకుపోతోంది. ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ., ఆరేళ్ల పాటు వెండితెరకు

పెళ్లి తరువాత సినిమాకు దూరమైన జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకుపోతోంది. ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ., ఆరేళ్ల పాటు వెండితెరకు దూరమైంది. తరువాత 2015లో 36 వయొనిథిలే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక, ఇప్పుడు మరో లేడి ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. అయితే రీ ఎంట్రీలో గ్లామర్ రోల్స్కు మాత్రం కాస్త దూరంగానే ఉంటోంది.

తాజాగా జ్యోతిక., ఓ స్టార్ హీరోకు జోడిగా నటించేందుకు ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 61వ సినిమాగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో జ్యోతిక, విజయ్కు జోడిగా కనిపించనుందట. సమంత, కాజల్ అగర్వాల్లు గ్లామర్ రోల్స్లో నటిస్తుండగా మరో కీలక పాత్రకు జ్యోతిక ఓకే చెప్పిందన్న ప్రచారం జరుగుతోంది.

దాదాపు 14 ఏళ్ల క్రితం తమిళ సినిమా ఖుషీలో విజయ్, జ్యోతికలు జంటగా నటించారు. ఇన్నేళ్ల తరువాత ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో కోలీవుడ్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతానికి యూనిట్ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా విజయ్, జ్యోతికల కాంబినేషన్ సినిమాకు ప్లస్ అవుతుందన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement