మళ్లీ ఇన్నేళ్లకు నాగ్‌కు జోడిగా!

Jyothika May Acts In Nagarjuna Bangarraaju Movie - Sakshi

‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఎంత హిట్‌ అయిందో.. అందులోని బంగార్రాజు పాత్ర అంత హైలెట్‌ అయింది. నాగార్జున కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి ప్రీక్వెల్‌ తీసే ఆలోచనలో ఉన్నటు​ అప్పట్లోనే టాక్‌ వినిపించింది. మొత్తానికి ‘బంగార్రాజు’ మళ్లీ తెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.

గతకొద్ది రోజులుగా బంగార్రాజు పక్కన నయనతార హీరోయిన్‌గా నటించబోతోన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే డేట్స్‌ కుదరకపోవడంతో నయన్‌ ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పలేదని టాక్‌. తాజాగా ఈ చిత్రంలో జ్యోతికను నాగ్‌కు జోడిగా ఎంపిక చేశారని తెలుస్తోంది. చిత్రయూనిట్‌ మాత్రం ఈ వార్తలపై ఇప్పటి వరకు స్పందించలేదు. గతంలో ఈ జంట ‘మాస్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించగా.. మళ్లీ ఇన్నేళ్లకు తెరపై కలిసి నటించనున్నారన్న మాట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top