రేడియో జాకీ తప్పుకున్నారు | jyothika kaatrin mozhi release postponed | Sakshi
Sakshi News home page

రేడియో జాకీ తప్పుకున్నారు

Oct 6 2018 5:30 AM | Updated on Oct 6 2018 5:30 AM

jyothika kaatrin mozhi release postponed - Sakshi

జ్యోతిక లేటెస్ట్‌ మూవీ ‘కాట్రిన్‌ మొళి’ ఈ నెల 18న  రిలీజ్‌ కావాలి. ఆ రోజు జ్యోతిక బర్త్‌డే కూడా. దీంతో ఆమె ఫ్యాన్స్‌ అంతా చాలా ఎగై్జట్‌ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ సినిమాను పోస్ట్‌పోన్‌ చేస్తున్నాం అని చిత్రబృందం ప్రకటించింది. జ్యోతిక ముఖ్య పాత్రలో రాధామోహన్‌ రూపొందించిన చిత్రం ‘కాట్రిన్‌ మొళి’.  హిందీ చిత్రం ‘తుమ్హారీ సులూ’కి ఇది రీమేక్‌. ఇందులో జ్యోతిక రేడియో జాకీగా కనిపిస్తారు. ‘‘మా సినిమాను ముందుగా అక్టోబర్‌ 18 రిలీజ్‌కు ప్లాన్‌ చేసుకున్నాం. కానీ ఆ వారంలో కొత్త సినిమాల వర్షం కురవబోతోంది. దాంతో సరైన థియేటర్స్, షోలు దొరికే విషయంలో ఇబ్బంది కలగవచ్చు. అందుకే మా సినిమాను నవంబర్‌కు వాయిదా వేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement