‘మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్‌’ అతడే! | John Legend Named As 2019 Sexiest Man Over People Magazine | Sakshi
Sakshi News home page

‘మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్‌’గా జాన్‌ లెజెండ్‌

Nov 13 2019 8:06 PM | Updated on Nov 13 2019 8:50 PM

John Legend Named As 2019 Sexiest Man Over People Magazine - Sakshi

హాలీవుడ్‌ సింగర్‌ జాన్‌ లెజెండ్‌ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే తన పాటలతో జనాలను ఉర్రూతలూగించిన ఈ పాప్‌ సింగర్‌ ఈ ఏడాదికి గాను ‘మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్‌’గా నిలిచాడు. ఈ విషయాన్ని ప్రముఖ పీపుల్‌ మ్యాగజైన్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా జాన్‌ లెజెండ్‌ మాట్లాడుతూ.. ‘ప్రముఖ హాలీవుడ్‌ నటుడు ఇడ్రిస్‌ ఎల్బా(2018) తర్వాత నేను ఈ అవార్డును పొందడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ అవార్డుతో నాలో ఒత్తిడి పెరిగింది. ఈ అవార్డు అందుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. అదేవిధంగా కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే అంత సెక్సీమెస్ట్‌ మ్యాన్‌గా ఉన్నానా లేదో అనుమానం కలుగుతోంది. అయితే ఈ విషయంలో గతేడాది విన్నర్‌గా నిలిచిన ఇడ్రిస్‌ ఎల్బాను అనుసరిస్తాను’అని జాన్‌ లెజెండ్‌ పేర్కొన్నారు.  

జాన్‌ లెజెండ్‌ తన ట్విటర్‌ ఖాతాలో.. ఒక చిన్ననాటి ఫోటో, ఎల్బా ఫోటో జతచేసి షేర్‌ చేశారు. ఆ ఫోటోకి ‘1995 నాటి జాన్‌ లెజెండ్‌  చాలా కలవరపడుతున్నాడు. కానీ 2018కి ఎంపికైన ఎల్బాను అనుసరిస్తున్నాడు. 2019 నన్ను ‘మోస్ట్‌ సెక్సీయెస్ట్‌ మ్యాన్‌’ గా ఎంపిక చేసిన పీపుల్‌ మ్యాగజైన్‌కి ధన్యవాదాలు అంటూ కామెంట్‌ చేసి ఎల్బాకు ట్యాగ్‌ చేశారు. దీంతో స్పందించిన ఎల్బా ‘ఓ మై గాడ్‌, ధన్యవాదాలు సోదరా!!! నువ్వు ఈ టైటిల్‌ పొందడానికి అర్హుడివి.. ఈ విషయం రాక్‌కు చెప్పకు ఆ టైటిల్‌ను గెలిచింది అతనే అనుకుంటున్నాడని సరదాగా అన్నాడు. నేను ఆ టైటిల్‌ తీసుకున్నవాడిగా.. ఆతనికి చెప్పే హృదయం నాకు లేదు’ అంటూ ఎల్బా రిట్వీట్ చేశారు.

అదేవిధంగా 2016లో పీపుల్‌ మ్యాగజైన్‌కి ‘మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్‌’గా ఎంపికైన జాన్సన్‌ కూడా స్పందిస్తూ.. ‘అభినందనలు సోదరా!.. ఈ క్లబ్‌లోకి నీకు స్వాగతం’ అని కామెంట్‌ చేశారు. కాగా జాన్‌ లెజెండ్‌ ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్‌ వంటి అవార్డులను పొందారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement