క్రీస్తు బోధనలతో... | 'Jesus Christ is the greatest scam in world history' | Sakshi
Sakshi News home page

క్రీస్తు బోధనలతో...

Dec 2 2015 10:54 PM | Updated on Sep 3 2017 1:23 PM

క్రీస్తు బోధనలతో...

క్రీస్తు బోధనలతో...

సంగాల దయానంద క్రియేషన్స్ ఇండియా పతాకంపై డాక్టర్ ఎస్.ఆర్. కుమార్ రాజా దర్శకత్వంలో

సంగాల దయానంద క్రియేషన్స్ ఇండియా పతాకంపై డాక్టర్ ఎస్.ఆర్. కుమార్ రాజా దర్శకత్వంలో చండ్ర పార్వతమ్మ నిర్మించిన చిత్రం ‘క్రీస్తు యేసు’. టి.ఎస్.ఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ - ‘‘బైబిల్ ఆధారంగా ఈ చిత్రం స్క్రీన్ ప్లే, సంగీతం ఉంటుంది. ‘మీతో పాటు మీ పొరుగు వారిని ప్రేమించండి.

మీ తల్లిదండ్రులను సన్మానించండి. ఆయా దేశాల చట్టాలను గౌరవించండి’ అని క్రీస్తు చేసిన బోధనలతో ఈ చిత్రం ఉంటుంది. భారతదేశ చలనచిత్ర రంగంలో గొప్ప మైలురాయిగా నిలిచిపోయే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది. క్రిస్మస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శివ-రవి, సంగీతం: సంగాల దయానంద్-సన్నీ, సమర్పణ: చండ్ర చంద్రశేఖర్ (లండన్).
 

Advertisement
 
Advertisement
Advertisement