కాబిల్‌ను అధిగమించిన సూపర్‌ 30 

Hrithik's Latest Film, Super 30, Surpassed the Kabil Collection - Sakshi

సాక్షి : బిహార్‌కు చెందిన ప్రముఖ గణిత వేత్త ఆనంద్‌కుమార్‌ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో రూపొందించిన చిత్రం సూపర్‌ 30. హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో నటించగా వికాస్‌ బహల్‌ దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొంది. ఫర్హా ఖాన్‌, కరణ్‌ జోహార్‌లతో పాటు చాలా మంది ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఈ చిత్రం చూసి మంచి కంటెంట్‌ ఉన్న సినిమాను ప్రేక్షకులకు అందించారనీ, హృతిక్‌ నటన బాగుందని అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. 

ఇక కలెక్షన్‌ పరంగా చూస్తే ఈ చిత్రం మొదటి రోజు దాదాపు పదకొండున్నర కోట్లు వసూలు చేసింది. హృతిక్‌ రోషన్‌ ఇంతకు ముందు చిత్రం కాబిల్‌ 10.43 కోట్లను రాబట్టగా, తాజా చిత్రం ఆ రికార్డును చెరిపేసింది. అంతేకాక, గతేడాది సూపర్‌ హిట్‌లుగా నిలిచిన అజయ్‌ దేవగణ్‌ రైడ్‌, అక్షయ్‌ కుమార్‌ ప్యాడ్‌ మ్యాన్‌ల కంటే ఎక్కువగా ఈ చిత్రం మొదటిరోజు వసూళ్లను సాధించింది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top