సముద్ర జీవిగా?

Hrithik Roshan's Super 30 finds a new release date - Sakshi

క్రిష్‌ సముద్ర జీవిగా మారబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. శంకర్‌ దర్శకత్వంలో హృతిక్‌ రోషన్‌ హీరోగా ఓ సినిమా రూపొందనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి బీటౌన్‌లో మరో వార్త పుట్టుకొచ్చింది. అదేంటంటే... ఈ సినిమాను అండర్‌ వాటర్‌లో షూట్‌ చేస్తారట. అద్భుతమైన శక్తులు ఉండే సముద్ర జీవిగా హృతిక్‌ కనిపిస్తారట. అంటే క్రిష్‌గా గాల్లో విన్యాసాలు చేసిన హృతిక్‌ ఇప్పుడు నీటిలో అద్భుతాలు చేస్తారన్నమాట. ఆల్రెడీ శంకర్‌ ఈ కథను హృతిక్‌కు చెప్పడం, హృతిక్‌ ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయట.

‘క్రిష్‌ 4’ చిత్రాన్ని హృతిక్, ‘ఇండియన్‌ 2’ చిత్రాన్ని శంకర్‌ పూరి ్తచేసుకున్న తర్వాత ఈ సినిమాకు కొబ్బరికాయ కొడతారట. అంటే ఇంకా బోలెడు టైమ్‌ ఉందని చెప్పుకోవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే.. హృతిక్‌ రోషన్‌ నటించిన తాజా చిత్రం ‘సూపర్‌ 30’ని జూలై 26న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంతకుముందు ఈ చిత్రం విడుదలను గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఈ ఏడాది జనవరి 25కి మార్చారు. ఇప్పుడు జూలైకి వాయిదా వేశారు. అంటే... కంగనా రనౌత్‌కు, హృతిక్‌ రోషన్‌కు బాక్సాఫీస్‌ పోటీ లేనట్లే. ఎందుకంటే కంగనా నటించిన ‘మణికర్ణిక: ఝాన్సీ రాణి’ చిత్రం ఈ నెల 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top