హక్కుదారుడే రాజు

Hrithik Roshan's poster release of 'Super 30' on Teachers' Day - Sakshi

‘రాజు కుమారుడు రాజు అవుతాడన్నది పాత మాట. ఎవరికి హక్కు ఉంటుందో వారే రాజు అవుతాడు’ అన్నది కొత్త మాట అంటున్నారు హృతిక్‌ రోషన్‌. ఈ డైలాగ్‌ కొట్టింది ‘సూపర్‌ 30’ సినిమా కోసమే అని తెలిసే ఉంటుంది. బీహార్‌ లెక్కల మాంత్రికుడు ఆనంద్‌ కుమార్‌ జీవితం ఆధారంగా ‘సూపర్‌ 30’  తెరకెక్కుతోంది. హృతిక్‌రోషన్‌ టైటిల్‌ రోల్‌లో వికాస్‌బాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, సాజిద్‌ నడియాడ్‌వాలా, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం రిలీజ్‌ చేసింది. లెక్కల జీనియస్‌ ఆనంద్‌ కుమార్‌లా మారిపోయిన హృతిక్‌ లుక్‌ సూపర్‌ అంటున్నారు ఆయన ఫ్యాన్స్‌. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top