ఆయన నటనకు పెద్ద ఫ్యాన్‌ని | Hippi Movie gets its release date fixed | Sakshi
Sakshi News home page

ఆయన నటనకు పెద్ద ఫ్యాన్‌ని

Apr 18 2019 12:42 AM | Updated on Apr 18 2019 12:42 AM

Hippi Movie gets its release date fixed - Sakshi

కార్తికేయ, దిగంగన సూర్యవన్షీ

‘‘పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘హిప్పీ’. ఇందులో ఓ వైపు రియలిస్టిక్‌ స్టోరీ ఉంటుంది. మరో వైపు ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. అన్ని కమర్షియల్‌ అంశాలను పర్‌ఫెక్ట్‌గా తెరకెక్కించారు దర్శకుడు. ఔట్‌పుట్‌ అనుకున్నదానికన్నా బాగా రావడంతో టీమ్‌ అంతా హ్యాపీగా ఉన్నాం’’ అని కార్తికేయ అన్నారు. ‘ఆర్‌ఎక్స్‌100’ ఫేమ్‌ కార్తికేయ, దిగంగన సూర్యవన్షీ జంటగా టిఎన్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘హిప్పీ’. కలైపులి ఎస్‌. థాను సమర్పణలో వి.క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాని జూన్‌ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ– ‘‘కబాలి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రం నిర్మించిన  కలైపులి ఎస్‌. థానుగారి సంస్థలో ‘హిప్పీ’ చేయడం గొప్పగా భావిస్తున్నాను. జె.డి. చక్రవర్తిగారిది చాలా కీ రోల్‌. కథ వినగానే ఆయన ఒప్పుకోవడంతో హ్యాపీగా ఫీలయ్యా. ఎందుకంటే  ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్‌ని’’ అన్నారు. ‘‘నా పాత్రకు ఉన్న ప్రాధాన్యత అర్థమై వెంటనే ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పేశాను. కార్తికేయ రొమాన్స్, ఫైట్స్, డ్యాన్స్‌ చాలా బాగా చేస్తున్నాడు. తప్పకుండా మంచి హీరోగా ఎదుగుతాడు’’ అన్నారు నటుడు జె.డి. చక్రవర్తి.

‘‘హిప్పీ’ చాలా సహజంగా, సింపుల్‌గా ఉంటుంది. మన కుటుంబంలోనో, స్నేహితుల జీవితాల్లోనో జరుగుతున్న అంశంలా ఉంటుంది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా సాగుతుంది. జె.డి. చక్రవర్తిగారి కెరీర్‌లో గుర్తుంచుకోదగ్గ సినిమా అవుతుంది’’ అన్నారు టిఎన్‌. కృష్ణ. ‘‘అన్ని వర్గాల వారికి కావాల్సిన అంశాలు మా చిత్రంలో ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్‌ 7న సినిమాని గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు కలైపులి ఎస్‌. థాను. జజ్బా సింగ్, బ్రహ్మాజీ నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌డీ రాజశేఖర్, సంగీతం: నివాస్‌ కె. ప్రసన్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement