ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు!

Heroine Trisha Romance With Vijay Sethupathi - Sakshi

సంచలన హీరోయిన్లలో త్రిష ఒకరు. 12 ఏళ్ల సినీ జీవతంలో ఈ చెన్నై చిన్నది ఎన్నో వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచింది. ఈ బ్యూటీ గురించి వదంతులు మీడియాల్లో హల్‌చల్‌ చేశాయి. వివాహం కూడా నిశ్చితార్థం వరకూ వెళ్లి ఆగిపోయింది. ప్రస్తుతం హీరోయిన్‌ ఓరియెంటెడ్‌, కమర్శియల్‌ కథా చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం 96 చిత్రంలో విజయ్‌ సేతుపతికి జంటగా త్రిష నటిస్తోంది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఈ విధంగా సమాధానాలు చెప్పి ప్రేక్షకులను సంతోష పరిచింది.

కొంతమంది అడిగిన తుంటరి ప్రశ్నలకు కూడా అదే స్థాయిలో త్రిష బదులిచ్చింది. మీకు బాగా నచ్చిన ప్రాంతం అన్న ప్రశ్నకు నేను సంతోసంగా ఉన్నా, కోపంగా ఉన్నా వెళ్లే ప్రదేశం న్యూయార్క్‌ అని చెప్పింది. మీరు చాలా అందంగా, సౌమ్యంగా ఉంటారు.. చిన్నతనం నుంచి ఇంతేనా అని ప్రశ్నించారు. దానికి బదులుగా నేను చూడడానికే సాధువులా ఉంటాను. స్కూల్‌లో నుంచే నాకు టెర్రర్‌ అనే పట్టం ఉంది. మీకు నచ్చిన అంశం గురించి చెప్పండని అడగానే.. సాధారంగా మహిళలు షాపింగ్‌ అంటే గంటల తరబడి చేస్తుంటారు. కానీ నాకు మాత్రం షాపింగ్ అంటేనే నచ్చదని త్రిష చెప్పుకొచ్చింది. కొడి చిత్రం రాజకీయ నాయకురాలిగా నటించారు. నిజ జీవితంలో అలాంటి కోరిక ఉందా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం రాజకీయ ప్రవేశం గురించి ఆలోచన లేదని హీరోయిన్‌ త్రిష సమాధానం చెప్పింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top