'పిల్లలు జీవితాన్ని మార్చేస్తారు' | Sakshi
Sakshi News home page

'పిల్లలు జీవితాన్ని మార్చేస్తారు'

Published Tue, Aug 16 2016 4:42 PM

'పిల్లలు జీవితాన్ని మార్చేస్తారు'

పిల్లలు జీవితాన్ని మార్చేస్తారంటూ ఆమిర్ ఖాన్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమిర్, కిరణ్ రావ్ దంపతులకు సరోగసీ ద్వారా మూడేళ్ల క్రితం మగబిడ్డ కలిగిన విషయం తెలిసిందే. మరోసారి ఆ సంతోషాన్ని గుర్తుచేసుకున్నారు ఆ దంపతులు. ఓ ఫెర్టిలిటీ క్లినిక్ లాంచ్ ఈవెంట్కు హాజరైన ఆమీర్ మీడియాతో మాట్లాడుతూ.. 'మేం బిడ్డను కావాలనుకున్నాం. సరోగసీ గురించి తెలుసుకున్నాం. ఆజాద్ పుట్టడం మాకెంతో సంతోషాన్నిచ్చింది. మేం ఎలాంటి తప్పు చేయలేదు, ప్రజలు ఇలాంటి విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.

పిల్లలు కలగడమనేది జీవితంలో ఎంతో సంతోషకరమైన విషయం.. వాళ్లు మన జీవితాల్లో మార్పు తీసుకొస్తారు. జునైద్ పుట్టుక.. నన్ను, నా జీవితాన్ని మార్చేసింది'  అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. ఆమిర్కు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్న విషయం తెలిసిందే. మాజీ భార్య రీనా దత్తాతో విడిపోయాక కిరణ్ రావ్ను ఆయన   వివాహం చేసుకున్నారు. లాంచ్కు హాజరైన కిరణ్ రావ్ మాట్లాడుతూ.. సరోగసీ ద్వారా తాము తల్లిదండ్రులు అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో తుషార్ కపూర్, ఫరాఖాన్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement