నా మిత్రుడు కింగ్ లా ఉన్నాడు: మోహన్ బాబు | 'Had a good time meeting my best friend' tweets Mohan babu | Sakshi
Sakshi News home page

నా మిత్రుడు కింగ్ లా ఉన్నాడు: మోహన్ బాబు

Sep 3 2016 8:27 PM | Updated on Sep 4 2017 12:09 PM

నా మిత్రుడు కింగ్ లా ఉన్నాడు: మోహన్ బాబు

నా మిత్రుడు కింగ్ లా ఉన్నాడు: మోహన్ బాబు

సినీ ఇండస్ట్రీలో శత్రువులే తప్ప మిత్రులు తక్కువ ఉంటారనే మాట వింటుంటాం. కానీ కొందరు మాత్రం అందుకు అతీతం. ఏళ్ల తరబడి తమ స్నేహబంధాన్ని కొనసాగిస్తూ ముందు తరాల వారికి ఆదర్శంగా నిలుస్తారు.

సినీ ఇండస్ట్రీలో శత్రువులే తప్ప మిత్రులు తక్కువ ఉంటారనే మాట వింటుంటాం. కానీ కొందరు మాత్రం అందుకు అతీతం. ఏళ్ల తరబడి తమ స్నేహబంధాన్ని కొనసాగిస్తూ ముందు తరాల వారికి ఆదర్శంగా నిలుస్తారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సూపర్ స్టార్ రజనీకాంత్లు అలాంటి స్నేహితులే.  ప్రస్తుతం ఎవరికి వారు వ్యక్తిగత జీవితాల్లో బిజీగా ఉన్నారు.   

అయితే మోహన్ బాబు వీలు చేసుకుని తన చిరకాల మిత్రుడు రజనీ ఇంటికి వెళ్లి ఆయన్ను కలుసుకున్నారు. శనివారం ఇద్దరూ కలిసి విలువైన సమయాన్ని గడిపారు. తన మిత్రుడు మహారాజులా కనిపిస్తున్నాడంటూ ట్వీట్ చేసి రజనీ మీదున్న అభిమానాన్ని చాటుకున్నారు మోహన్ బాబు. అలాగే ఈ కలియుగంలో రజనీ దుర్యోధనుడైతే, తాను కర్ణుడినంటూ పేర్కొన్నారు.

చాలాకాలం తర్వాత తన సోదరి లతను కలుసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్ విజయం వెనుక ఆయన సతీమణి లత ఉందని తాను బలంగా నమ్ముతానంటూ ట్వీట్ చేశారు. వారితో కలిసి ఆత్మీయంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement