ఇంకేం కావాలే!

geeta govindam first song release - Sakshi

విజయ్‌ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గీత గోవిందం’. జీఏ2 బ్యానర్‌పై అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్ని’ వాసు నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌ ‘ఇంకేం ఇంకేం కావాలే’ ని రిలీజ్‌ చేశారు. గోపీ సుందర్‌ మ్యూజిక్‌లో సిడ్‌ శ్రీరామ్‌ ఈ సాంగ్‌ను పాడారు. అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌ అందించారు.

ఈ పాట రిలీజ్‌ చేసిన రెండు రోజుల్లోనే యూట్యూబ్‌లో రెండు మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. ఈ సందర్భంగా – ‘‘మా సినిమాలోని ఫస్ట్‌ మెలోడీ సాంగ్‌ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇదొక్క పాటే కాదు ఆల్బమ్‌లోని ప్రతి పాట ఇంతే అద్భుతంగా ఉండబోతోంది. సినిమాలో పాటలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఆగస్ట్‌ 15న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు చిత్రబృందం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top