చచ్చిపోవాలనుకున్నా; నటి భావోద్వేగం | Game Of Thrones Emilia Clarke Who Survived Aneurysms Inspirational Post | Sakshi
Sakshi News home page

‘అపుడు.. ప్లగ్‌లో చేయి పెట్టి చచ్చిపోవాలనుకున్నా’

Mar 22 2019 9:04 PM | Updated on Mar 22 2019 9:06 PM

Game Of Thrones Emilia Clarke Who Survived Aneurysms Inspirational Post - Sakshi

ఎమిలియా క్లార్క్‌ భావోద్వేగం

‘ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంకా బతికి ఉన్నందుకు అదృష్టవంతురాలిగా ఫీలవుతున్నాను. ఈ కథ ముగింపును చూడగలుతున్నాను’ అంటూ డ్రామా సిరీస్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’  స్టార్‌, ఇంగ్లీష్‌ నటి ఎమిలియా క్లార్క్‌ భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, మెదడు వాపు వ్యాధి గ్రస్తుల కోసం చికిత్స కోసం కృషి చేయడానికి వెనుక గల కారణాలను వెల్లడించారు. ఫిబ్రవరి, 2011లో జిమ్‌ చేస్తున్న సమయంలో ఎమిలియా తొలిసారి బ్రెయిన్‌ ఎన్యూరిజం(మెదడు భాగంలో రక్తనాళాలు చిట్లడం)కు గురయ్యారు. అదే సమయంలో గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ ఫస్ట్‌ సీజన్‌లో డెనెరీస​ తార్గరెయిన్‌ అనే పాత్రలో నటించాల్సి ఉంది. కానీ ఊహించని ఈ పరిణామానికి ఆమె షాకయ్యారు. అయితే మనోనిబ్బరం ఉంటే ఎటువంటి కఠిన పరిస్థితులనైనా ఇట్టే జయించవచ్చు అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని, ఒకవేళ మరణం సంభవించినా ఇక భయపడబోనంటూ న్యూయార్క్‌ మ్యాగజీన్‌లో స్ఫూర్తిదాయక కథనం రాసుకొచ్చారు.

ఏ బ్యాటిల్‌ ఆఫ్‌ మై లైఫ్
‘ఒక్కోసారి తీరని వేదన అనుభవించేదాన్ని. మాట పడిపోయేది. నా మెదడు పూర్తిగా నాశనమై పోయిందని అనుకునేదాన్ని. నా పేరు కూడా గుర్తుండేది కాదు. మొదటిసారి నాకు బ్రెయిన్‌ హేమరేజ్‌ వచ్చినపుడు నన్ను ఆస్పత్రిలో చేర్చారు. అప్పుడు నా వయస్సు 24. నాకే ఎందుకిలా జరిగింది. జీవితం ఎందుకింత దుర్భరంగా మారిందని ఆవేదన పడ్డాను. అందుకే ప్లగ్‌లో చేయి పెట్టి చచ్చిపోవాలనుకున్నా. అందుకోసం ఆస్పత్రి సిబ్బందిని ఎంతగా వేడుకున్నా వారు అంగీకరించలేదు. మాట పడిపోయినప్పుడు..ఇక నటనా జీవితాన్ని కొనసాగించలేమోనని కుంగిపోయాను. కానీ అదృష్టవశాత్తు కఠిన పరిస్థితుల నుంచి ప్రస్తుతానికి బయటపడ్డా’ అంటూ ‘ఏ బ్యాటిల్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ పేరిట ఎమిలియా క్లార్క్‌ తన అనుభవాలను పంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement