పూజాహెగ్డే లుక్‌కి అభిమానులు ఫిదా | First Look Of Most Eligible Bachelorette Hegdepooja | Sakshi
Sakshi News home page

పూజాహెగ్డే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌' ఫస్ట్ లుక్

Published Fri, Feb 14 2020 6:45 PM | Last Updated on Fri, Feb 14 2020 7:12 PM

First Look Of Most Eligible Bachelorette Hegdepooja  - Sakshi

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయ‌గానే సినిమా అభిమానులు నుంచి సాధార‌ణ ప్రేక్ష‌కుల వ‌ర‌కు విప‌రీత‌మైన పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వ‌డం ఈ సినిమా మీద ఉన్న క్రేజ్‌ని తెలియ‌జేస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాకి సంబంధించి మొద‌టి స్టెప్ అంటూ విడ‌దుల చేసిన అఖిల్ అక్కినేని లుక్‌కి మంచి రెస్పాన్స్ రావ‌టం విశేషం. ఇప్ప‌డు సెకండ్ స్టెప్ అంటూ హీరోయిన్ పూజా హెగ్డే లుక్‌ని విడుదల చేశారు.  (బ్యాచ్‌లర్‌ వచ్చేశాడు)

ఇలా స్టెప్స్ అంటూ ఆడియన్స్ లో ఫ్యాన్స్‌లో ఈ చిత్రం పై క్యూరియాసిటి మరింత పెంచుతున్నారు. ఈ రెండు లుక్‌లు ఇటు మీడియాలో అటు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండ‌టం ఈ సినిమాపై ప్రేక్ష‌కుల అంచ‌నా తెలియ‌జేస్తుంది. అఖిల్ అక్కినేని ఒక ప్ర‌త్యేఖ ఇమేజ్ ని త‌న సోంతం చేస‌కుంటున్నారు. ఈ సినిమా త‌న కెరీర్ బెస్ట్ కానుంది. బొమ్మ‌రిల్లు చిత్రం విడుద‌ల‌య్యి ఇన్ని సంవ‌త్స‌రాల‌యినా కూడా ఇప్ప‌టికి బొమ్మ‌రిల్లు చిత్రం లోని సంభాష‌ణ‌లు కాని, స‌న్నివేశాలు కాని డిస్క‌ష‌న్ లో వున్నాయంటే ఆ సినిమా క్రియెట్ చేసిన ట్రెండ్ అలాంటిది.. ఆ చిత్ర ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ కొంత గ్యాప్ త‌రువాత మ‌రోక్క‌సారి ప‌ది సంవ‌త్స‌రాలు మాట్లాడుకునేలా చిత్ర క‌ధ కుదిరింద‌ని చిత్ర యూనిట్ అంటున్నారు.  (మోస్ట్‌ ఎలిజిబుల్‌!)

అదే విధంగా భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే చిత్రాల‌తో కెరీర్ బెస్ట్ గ్రాస‌ర్‌గా రికార్డు విజ‌యాల్ని అందించిన బ‌న్ని వాసు ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా శ్ర‌ధ్ధ తీసుకుంటున్నారు. సంగీతం గోపి సుంద‌ర్ అందించారు, ఈ ఆడియోని అతి త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ లో విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు..

న‌టీ న‌టులు 
అఖిల్ అక్కినేని
పూజా హెగ్ఢే
ఆమ‌ని
ముర‌ళి శ‌ర్మ‌
జ‌య ప్ర‌కాశ్
ప్ర‌గ‌తి
సుడిగాలి సుధీర్
గెటెప్ శ్రీను
అభ‌య్
అమిత్

టెక్నీషియ‌న్స్
డైరెక్ట‌ర్ : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్
సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ
ఎడిట‌ర్ : మార్తండ కే వెంక‌టేశ్
ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా
నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌
స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్
బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement