ఎట్టకేలకు కుటుంబాన్ని చేరిన నటుడు

Finally Actor Prithviraj Sukumaran Reunites With Family - Sakshi

మలయాళ సినీ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నారు. లాక్‌డౌన్‌తో రెండు నెలల ఎడబాటు,14 రోజుల క్వారంటైన్‌ అనంతరం శనివారం తన కుటుంబంతో కలిసిపోయారు. ఇంటికి చేరుకోగానే తన భార్య సుప్రియా మీనన్‌, గారాల కూతురు అలంకృతాతో దిగిన ఫ్యామిలీ ఫోటోను శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘మళ్లీ ఒకటయ్యాం’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటోలో ఇన్ని రోజులు తన కుటుంబాన్ని మిస్‌ అయినా బాధ.. ప్రస్తుతం కుటుంబాన్ని చేరకున్న ఆనందపు క్షణాలు అన్నీ తన కళ్లలో కొట్టొచ్చిన్నట్లు కన్పిస్తున్నాయి. (ఆ మధుర క్షణాలు.. చాలా మిస్సవుతున్నా)

‘ఆదుజీవితం’ షూటింగ్‌ నిమిత్తం​ విదేశాలకు వెళ్లిన నటుడు పృథ్వీరాజ్‌, దర్శకుడు బ్లెస్సీతో పాటు 58 మంది చిత్ర బృందం లాక్‌డౌన్‌ కారణంగా జోర్డాన్‌లో చిక్కుకున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల తర్వాత భారత్‌ చేపట్టిన వందే భారత్‌ మిషన్‌లో భాగంగా మే 22న ప్రత్యేకం విమానంలో భారత్‌ తిరిగొచ్చారు. అనంతరం కేరళకు చేరుకున్న వీరందరిని 14 రోజులుపాటు క్వారంటైన్‌లో పెట్టారు. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్‌ కోవిడ్‌-19 టెస్ట్‌ చేయించుకోగా నెగెటివ్‌ అని తేలింది. దీనికి సంబంధించిన రిపోర్టును కూడా పృథ్వీ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ మూడు నెలలు తన భార్య, కూతురిని చాలా మిస్‌ అవుతున్న సంగతి, తన క్వారంటైన్‌కు సంబంధించిన విషయాలన్ని ఎప్పటికప్పుడు  సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే.

Reunited 👨‍👩‍👧 ❤️

A post shared by Prithviraj Sukumaran (@therealprithvi) on

BACK! #OffToQuarantineInStyle

A post shared by Prithviraj Sukumaran (@therealprithvi) on

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top