ఆ మధుర క్షణాలు.. చాలా మిస్సవుతున్నా

Prithviraj Wife Supriya Misses Vacations With Husband - Sakshi

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ భార్య సుప్రియ మీనన్‌

‘‘ఆ ప్రయాణాలను మిస్సవుతున్నా! అంతకు మించి నిన్ను చూడకుండా ఉండలేకున్నా! ఇంకో వారం దాకా ఎదురుచూడక తప్పదేమో కదా’’అంటూ మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సతీమణి సుప్రియా మీనన్‌ భర్తపై ప్రేమను చాటుకున్నారు. కరోనా తమ మధ్య తెచ్చిన ఎడబాటు త్వరలోనే ముగిసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదు జీవితం చిత్ర షూటింగ్‌ కోసం జోర్డాన్‌ వెళ్లిన పృథ్వీరాజ్‌ సహా ఇతర యూనిట్‌ సభ్యులు కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఇటీవలే వీరంతా కేరళ చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా చిత్ర బృందం మొత్తం క్వారంటైన్‌లో ఉన్నారు.(‘ఇప్పుడే కాదు.. ఎప్పటికీ మనం కలిసే ఉంటాం’)

ఈ నేపథ్యంలో దాదాపు రెండు నెలలుగా విరహ వేదనలో మునిగిపోయిన పృథ్వీరాజ్‌ భార్య సుప్రియతో గడిపిన ఆనంద క్షణాలను గుర్తుచేసుకుంటూ ఓ పాత ఫొటోను గురువారం షేర్‌ చేశారు. ‘‘జనవరి 2020లో మా ప్రయాణం! మౌంట్‌ బ్లాంక్‌ వెళ్తున్నపుడు, స్విట్జర్లాండ్‌/ఫ్రాన్స్‌ సరిహద్దులో.. కారు వెనుక భాగంలో గంటల తరబడి విరామం తీసుకున్న మధుర క్షణాలు. మున్ముందు ఇలాంటి అనుభవాలు మరెన్నో ఉంటాయి అనుకున్నాం! త్వరలోనే అంతా నార్మల్‌ అయిపోవాలని కోరుకుంటున్నా. పరిస్థితులు యథాస్థితికి వచ్చి.. ప్రయాణీకులు తమకిష్టమైన, తాము ప్రేమించే పనులు చేసే వీలు కలగాలి’’అని క్యాప్షన్‌ జతచేశారు. ఇక భర్త పోస్టుకు సుప్రియ పైవిధంగా తన స్పందన తెలియజేశారు.  (ప్రేయసిని పెళ్లాడిన నటుడు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top