గ్లామర్‌ పాత్రలకు సిద్ధమే

Divyansha kaushik about majili movie - Sakshi

‘‘మాది ఢిల్లీ. మూడేళ్లుగా ముంబైలో ఉంటున్నాను. నటనలో శిక్షణ తీసుకున్న తర్వాత ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని. అలా ఆడిషన్స్‌లోనే ‘మజిలీ’ సినిమాకు ఎంపిక అయ్యాను. తెలుగులో నా తొలి చిత్రమిది’’ అని దివ్యాంశా కౌశిక్‌  అన్నారు. నాగచైతన్య హీరోగా, సమంత, దివ్యాంశా కౌశిక్‌ హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 5న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా దివ్యాంశా కౌశిక్‌ మాట్లాడుతూ– ‘‘తమిళంలో నా తొలి చిత్రం సిద్ధార్థ్‌తో చేస్తున్నాను. అది మే లేదా జూన్‌లో విడుదలవుతుంది. ‘మజిలీ’ చిత్రంలో నా పాత్ర పేరు అన్షు. చైతన్యను ప్రేమించే అమ్మాయిగా కనిపిస్తాను. నాగచైతన్య డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌. అమేజింగ్‌ కోస్టార్‌. చైతన్యతో కలిసి నటించినందుకు ఆనందంగా ఉంది. ఇందులో సమంతతో కలిసి నటించలేదు. తెలుగులోకి ఎంట్రీ కాకముందు ‘ఏమాయ చేసావె’ సినిమా చూశాను. చైతన్య–సమంత పెయిర్‌ను బాగా ఇష్టపడ్డాను. ‘అర్జున్‌ రెడ్డి, నిన్ను కోరి’ చిత్రాలు చూశాను.

‘రంగస్థలం, ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాలు చూడాలి. సమంతగారు నటించిన ‘ఈగ’ సినిమా హిందీ అనువాదాన్ని ఎన్నిసార్లు చూశానో  లెక్కేలేదు. డైరెక్టర్‌ శివగారు ఇచ్చిన స్వేచ్ఛ, నాలో నింపిన నమ్మకంతో ‘మజిలీ’లో బాగా నటించాను. తెలుగుతో పోల్చితే తమిళ్‌లో నటించడం కొంచెం కష్టంగా అనిపించింది. కంటెంట్‌ ఉన్న సినిమాలే కాదు.. గ్లామర్‌ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. బాలీవుడ్‌లో ఆలియా భట్, కరీనా కపూర్, అనుష్కా శర్మలను ఇష్టపడతాను. ఇక్కడ సమంత నటనంటే ఇష్టం. కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.. వివరాలు త్వరలో చెబుతా’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top