ఇంకా షాక్‌లోనే ఉన్నా | Director Shankar Reavts on Indian 2 Accident | Sakshi
Sakshi News home page

ఇంకా షాక్‌లోనే ఉన్నా

Feb 27 2020 6:01 AM | Updated on Feb 27 2020 6:01 AM

Director Shankar Reavts on Indian 2 Accident - Sakshi

శంకర్‌

వారంరోజుల క్రితం ‘ఇండియన్‌ 2’ సెట్లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. భారీ క్రేన్‌ షూటింగ్‌ చేస్తున్న యూనిట్‌పై పడటంతో ముగ్గురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఇది జరిగి వారం అయింది. ‘‘ఈ సంఘటన జరిగినప్పటి నుంచి నేను షాక్‌లోనే ఉన్నాను. నా అసిస్టెంట్‌ డైరెక్టర్, టీమ్‌లో ఇద్దరు చనిపోవడం నన్ను నిద్రలేని రాత్రులకు గురి చేస్తోంది. నేను ప్రమాదాన్ని తృటిలో తప్పించుకున్నప్పటికీ, ఆ క్రేన్‌ ఏదో నా మీద పడుంటే బావుండు అనిపిస్తోంది. చనిపోయినవారి కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను’’ అని బుధవారం ట్వీట్‌ చేశారు శంకర్‌.

Advertisement
 
Advertisement
Advertisement