ఆ ముద్ర పడకుండా చూసుకుంటున్నా

Director Maruthi Speech  at Prati Roju Pandaage - Sakshi

‘‘సీరియస్‌ విషయాన్ని కూడా ఎక్కువ సీరియస్‌గా తీసుకోను నేను. అది నా మనస్తత్వం. ఏదైనా విషయం చెప్పాలన్నా ఎంటర్‌టైనింగ్‌గానే చెబుతాను. నా సినిమాలో కథలను కూడా అలానే చెప్పాలనుకుంటాను’’ అన్నారు దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాస్‌ నిర్మించారు. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలయింది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి పంచుకున్న విశేషాలు.

► ‘ప్రతిరోజూ పండగే’ కథను ఎవరికి చెప్పినా బావుంది అన్నారు. 65 రోజుల్లో సినిమాను పూర్తి చేశాం.  సినిమా రిలీజ్‌ ముందు కూడా పెద్ద టెన్షన్‌ పడలేదు. ఎందుకంటే.. ఎమోషన్స్‌తో ఓ కథను సరిగ్గా చెప్పగలిగితే ఆడియన్స్‌ ఎప్పుడూ ఆదరిస్తారు. మా సినిమాతో అది మళ్లీ నిరూపితం అయింది.  

► థియేటర్స్‌లో ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎమోషన్‌ కంటే కామెడీ టైమింగ్‌ ఏమైనా డామినేట్‌ అయిందా? అనే డౌట్‌ వచ్చింది.  ‘భలే భలే మగాడివోయి’ సినిమా తర్వాత ఇన్ని ఫోన్‌ కాల్స్‌ రావడం ఇదే. ‘చాలా హెల్దీగా చేశావు’ అని చిరంజీవిగారు అభినందించారు. ‘చాలా బాగా డీల్‌ చేశావు’ అని రాఘవేంద్రరావుగారు అన్నారు. ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్‌ వస్తున్నాయి.

► రావు రమేశ్‌గారు పాత్ర బాగా వచ్చింది అని అందరూ అంటున్నారు. ఆయన యాక్ట్‌ చేస్తుంటే మేమందరం ఎగ్జయిట్‌ అయ్యాం.

► మారుతి ఒక జానర్‌ సినిమాలే తీయగలడు అని ముద్ర వేయించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే సినిమా సినిమాకు జానర్‌ మారుస్తుంటాను. ఒకేలాంటి సినిమాలు తీస్తే నాకు నేనే బోర్‌ కొట్టేస్తాను.

►  ప్రస్తుతం ట్రెండ్‌ మారిపోయింది. బెస్ట్‌ కథలే ఇవ్వాలి. వెబ్‌ సిరీస్‌లు కూడా వస్తున్నాయి. అవే ఫ్యూచర్‌. నేనూ వెబ్‌ సిరీస్‌ చేస్తాను. నెట్‌ఫ్లిక్స్‌ ‘లస్ట్‌ స్టోరీస్‌’కి అడిగారు. కానీ కుదర్లేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top