మరో కొత్త ప్రయాణం | Dangal director Nitesh Tiwari's next 'Chhichhore' goes on floors | Sakshi
Sakshi News home page

మరో కొత్త ప్రయాణం

Oct 1 2018 2:58 AM | Updated on Oct 1 2018 2:58 AM

Dangal director Nitesh Tiwari's next 'Chhichhore' goes on floors - Sakshi

నితేష్‌ తివారీ

నితేష్‌ తివారీ దర్శకత్వంలో వచ్చిన ‘దంగల్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఆమిర్‌ ఖాన్, ఫాతిమా సనా షేక్, జైరా వసీమ్‌ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం  చైనా, జపాన్‌ దేశాల్లో కూడా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఇప్పుడు నితేష్‌ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం చిత్రీకరణ ముంబైలో ఆదివారం మొదలైంది.

ఈ చిత్రానికి ‘ఛిచ్చోరే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘‘ఈ రోజు నా జీవితంలో ప్రత్యేకమైనది. ఎందుకుంటే నా తాజా సినిమా షూటింగ్‌ మొదలైంది. కొత్త ప్రయాణం’’ అని పేర్కొన్నారు తివారీ. సాజిద్‌ నడియాద్‌వాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని నితేష్‌ బయటపెట్టలేదు. కానీ సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్, శ్రద్ధాకపూర్, ప్రతీక్‌  బబ్బర్, వరుణ్‌ శర్మ పేర్లు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement