కరోనా ఎఫెక్ట్‌: సెలబ్రెటీలు సరదాసరదాగా..

Covid 19 Impact: Tollywood Celebrities Self Isolation - Sakshi

కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపుతోంది. సినీ ఇండస్ట్రీపై  కూడా కరోనా ప్రభావం తీవ్రంగా పడుతోంది. సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు, ఫంక్షన్‌లు పూర్తి రద్దయ్యాయి. దీంతో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో భాగంగా సెలబ్రెటీలు ఇంటికే పరిమితమయ్యారు. కొందరు తమకు దొరికిన ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తుండగా.. మరికొందరు తమలోని మరో ప్రతిభను వెలికితీసే పనిలో పడుతున్నారు. అంతేకాకుండా అనుకోకుండా దొరికిన ఈ ఖాలీ సమయాన్ని ఏ విధంగా ఎంజాయ్‌ చేస్తున్నోమో తెలుపుతూ పలు ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. 

గ్యాప్‌ తర్వాత ‘అల.. వైకుంఠపురములో’తో హిట్‌ అందుకున్న స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా షూటింగ్‌ రద్దు కావడంతో దొరికిన ఈ కాసింత సమయాన్ని కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నాడు. తన బామ్మ (అల్లు రామలింగయ్య భార్య)తో కలిసి సరదాగా గడిపాడు. ఈ క్రమంలో మనవడికి బామ్మ ఆప్యాయంగా ముద్దుపెట్టిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక పూరి జగన్నాథ్‌ ‘ఫైటర్‌’ కోసం బాక్సింగ్‌ నేర్చుకున్న విజయ్‌ దేవరకొండ కరోనా దెబ్బకి తమ్ముడు ఆనంద్‌ దేవరకొండతో కలిసి ఇంట్లో చదరంగా ఆడుతున్నాడు. తమ్ముడితో కలసి ఈ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ ఫన్నీగా చెస్‌ ఆడుతున్న ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.    

చదవండి:
2008లో ఓ వ్యక్తిని ప్రేమించా: అనుష్క
రజనీతో అవకాశం.. లారెన్స్‌ ఏం చేస్తాడో?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top