వేదిక మీదే కుప్పకూలి.. హాస్య నటుడు మృతి | Comedian Manjunath Naidu Dies on Stage in Dubai | Sakshi
Sakshi News home page

వేదిక మీదే కుప్పకూలి.. హాస్య నటుడు మృతి

Jul 21 2019 11:09 AM | Updated on Jul 21 2019 11:09 AM

Comedian Manjunath Naidu Dies on Stage in Dubai - Sakshi

నటుడిగా, స్టాండప్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న మంజునాథ్ నాయుడు (36) గుండె పోటుతో మృతి చెందారు. దుబాయ్‌లోని ఓ హోటల్‌లో పర్ఫామెన్స్‌ ఇస్తుండగా తీవ్ర గుండెపోటు రావటంతో వేదిక మీద కుప్పకూలిపోయారు. అయితే ప్రేక్షకులు, నిర్వాహకులు స్కిట్‌లో భాగంగానే అలా చేశారని భావించి ఆలస్యం చేయటంతో మంజునాథ్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది.

చెన్నైకి చెందిన మంజునాథ్ నాయుడు కొంత కాలంగా దుబాయ్‌లో నివసిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఆయన స్టాండప్‌ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో మ‍ంజునాథ్‌ పర్ఫామెన్స్‌ స్టార్ట్ చేశారు. కొద్ది సేపటికే శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతూ కుప్పకూలిపోయారు. వెంటనే ఆయను హాస్పిటల్‌కు తరలించినా అప్పటికే మృతి చెందినట్టుగా డాక్టర్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement