హాస్య నటుడు కోవై సెంథిల్‌ కన్నుమూత

Comedian Kovai Senthil Died In Tamil Nadu - Sakshi

తమిళనాడు, పెరంబూరు: హాస్య నటుడు కోవై సెంథిల్‌(74) ఆదివారం ఉదయం కోవైలో కన్నుమూశారు. పలు చిత్రాల్లో హాస్య పాత్రలతో పాటు, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ నటించి మెప్పించిన నటుడు కోవై సెంథిల్‌. ముఖ్యంగా ఈయన దర్శకుడు విక్రమన్‌ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. రజనీకాంత్‌ నటించిన పడయప్పా, కే.భాగ్యరాజ్‌ నటించి, దర్శకత్వం వహించిన ఇదునమ్మ ఆళు, వెంకట్‌ప్రభు తెరకెక్కించిన గోవా చిత్రాల్లో మంచి గుర్తింపు పొందాడు. కోవైలో నివశిస్తున్న కోవై సెంథిల్‌ ఇటీవల అనారోగ్యానికి గురై కోవైలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రమే ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిపారు.  కోవై సెంథిల్‌ మృతికి  పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత నటీనటుల సంఘం కోవై సెంథిల్‌కు సంతాపం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. గత 4వ తేదీన హాస్య నటుడు రాకెట్‌ రామనాథన్, 5వ తేదీన నటుడు వెళ్‌లై సుబ్బయ్య, ఇప్పుడు నటుడు కోవై సెంథిల్‌ ఇలా ఒకే వారంలో ముగ్గురు సీనియర్‌ నటులు మృతి చెందారన్నది గమనార్హం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top