మెగా 151 టైటిల్ 'సై రా'..! | Chiranjeevi 151th movie title sye raa narasimha reddy | Sakshi
Sakshi News home page

మెగా 151 టైటిల్ 'సై రా'..!

Aug 22 2017 10:28 AM | Updated on Sep 19 2019 8:25 PM

మెగా 151 టైటిల్ 'సై రా'..! - Sakshi

మెగా 151 టైటిల్ 'సై రా'..!

ఈ రోజు (మంగళవారం) మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి కొత్త సినిమా మోషన్ పోస్టర్ ను

ఈ రోజు (మంగళవారం) మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి కొత్త సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీ వేడుకగా నిర్వహించేందుకు రెడీ అవుతోంది మెగా టీం. దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై టైటిల్ లోగో మోషన్ పోస్టర్ లను విడుదల చేయనున్నారు. తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ముందుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే టైటిల్ నే పెట్టాలని నిర్ణయించినా.. తరువాత యూనివర్సల్ అపీల్ కోసం టైటిల్ ను మార్చాలని నిర్ణయించారు. ఒకేసారి తెలుగు తమిళ హిందీ మలయాళ భాషల్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తుండటంతో అందుకు తగ్గట్టుగా మహావీర అనే టైటిల్ ను ఫిక్స్ చేశారన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తెర మీదకు వచ్చింది.

ఓ జానపథ గేయంలోని పదాలను సినిమా టైటిల్ గా నిర్ణయించారన్న టాక్ వినిపిస్తుంది. రాయలసీమ ప్రాంతంలో ఉయ్యాలవాడ సాహసాలను కీర్తిస్తూ పాడుకునే 'సై రా నరసింహారెడ్డి' అనే పదాలనే సినిమా టైటిల్ గా నిర్ణయించారట. అయితే ఈ విషయంపై యూనిట్ సభ్యులు మాత్రం ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అఫీషియల్ గా సినిమా టైటిల్ ఎంటో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement