
ప్రియదర్శి, అనన్య
అగ్గిపెట్టెలో పట్టేంత చిన్న చీరను నేచి, చేనేత రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించు కున్నారు చింతకింది మల్లేశం. పెద్ద చదువులు చదవకపోయినా చేనేత శ్రమజీవుల కోసం ఆయన ఆసు యంత్రాన్ని ఆవిష్కరించారు. ఇందుకుగాను ఆయన్ని ‘పద్మశ్రీ’ అవార్డు వరించింది. తాజాగా చింతకింది మల్లేశం బయోపిక్‌ని ‘మల్లేశం’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. టైటిల్ రోల్‌లో ప్రియదర్శి నటిస్తున్నారు.
రాజ్ ఆర్ దర్శకత్వంలో శ్రీ అధికారి, రాజ్ ఆర్ నిర్మిస్తున్నారు. అనన్య, ఝాన్సీ, చక్రపాణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లాలో ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. మార్క్ కె.రాబిన్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి గోరేటి వెంకన్న, చంద్రబోస్ పాటలు రాస్తున్నారు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ సిద్ధారెడ్డి.